Lrc Player

Nee_Navvula

Unknown artist
[04:46.59]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:38.23] నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది

[00:42.22] ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...

[00:46.23] నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది

[00:50.26] ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...

[00:53.74] నీ కోకను సీతాకోక నీ పలుకులు చిలకల మూక

[00:57.99] నీ చూపును చంద్రలేఖ నీ కొంగును ఏరువాక

[01:02.24] బదులిమ్మంటు బ్రతిమాలాయి ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...

[01:07.75] అసలివ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...

[01:12.23] నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది

[01:15.97] ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...

[01:59.49] నీ బుగ్గల్లోని సిగ్గులు కొన్ని మొగ్గలకైనా ఇవ్వద్దు

[02:03.24] నా వైపే మొగ్గిన నీకైతే

[02:05.24] అవి మొత్తం ఇవ్వచ్చు

[02:07.49] నీ బాసల్లోని తియ్యదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు

[02:11.23] నాకోసం వేచిన నీకైతే

[02:13.24] అది రాసిగా ఇవ్వచ్చు

[02:15.49] భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు

[02:19.24] భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు

[02:23.23] నీకే మొక్కే నాకే ఇవ్వచ్చూ...

[02:27.25] నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది

[02:31.23] ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...

[02:35.26] నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే

[02:38.23] అరువడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...

[03:42.69] నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు

[03:46.71] మరి నాకై పుట్టిన నీకైతే

[03:48.45] అది పూర్తిగ ఇవ్వచ్చు

[03:50.46] నీ భారం మోసే అదృష్టాన్నే భూమికి సైతం ఇవ్వద్దు

[03:54.46] నేనంటే మెచ్చిన నీకైతే

[03:56.46] అది వెంటనే ఇవ్వచ్చు

[03:58.43] నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు

[04:02.23] నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు

[04:06.46] నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చూ...

[04:10.46] నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది

[04:14.46] ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...

[04:18.46] నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది

[04:22.46] ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...

[04:26.21] నా వాకిట ముగ్గులు నీకే నా దోసిట మల్లెలు నీకే...

[04:29.97] నా పాపిటి వెలుగులు నీకే నా మాపటి మెరుపులు నీకే

[04:33.97] ప్రాయం ప్రణయం ప్రాణం నీకే

[04:36.46] ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా...

[04:39.95] బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా...