Lrc Player

[iSongs.info] 06 - Ardha Shathabdi

Unknown artist
[05:31.66]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:18.24] అర్ధశతాబ్దపు అఙానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా

[00:24.98] ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా

[00:31.73] శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం

[00:38.73] నీ పాపిటలొ భక్తిగదిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా !

[01:19.73] కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ

[01:23.24] ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే జనాలు తలలర్పిస్తారే

[01:30.24] సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని

[01:37.23] నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే

[01:41.48] అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమిటి సాధించాలి

[01:50.98] ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం

[01:57.99] జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా ఓ అనాథ భారతమా!

[02:38.23] అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం

[02:42.24] కారడవుల్లో క్రూరమృగంలా దాక్కుని ఉండాలా వెలుగుని తప్పుకు తిరగాలా

[02:49.48] శతృవుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్త్యవ్యం

[02:53.98] స్వజాతి వీరులనణచే విధిలో సవాలు చెయ్యాలా అన్నల చేతిలొ చావాలా

[03:00.73] తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి

[03:05.73] ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే

[03:10.48] నడిచే శవాల సిగలో తురుమిన నెత్తుటి మందారం ఈ సంధ్యాసిందూరం

[03:17.48] వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేనమ్మా గతి తోచని భారతమా!

[04:03.99] తన తలరాతను తానే రాయగల అవకాశాన్నే వదులుకొని

[04:08.48] తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని

[04:13.23] ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని

[04:18.23] కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం

[04:25.23] ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుండట అధికారం

[04:31.99] కృష్ణుడు లేని కురుక్షేత్రముగ సాగే ఈ ఘోరం చితిమంటల సిందూరం

[04:38.73] చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విషాద భారతమా!