Lrc Player

[iSongs.info] 02 - Kolo Kolanna Kolo_

Unknown artist
[05:05.11]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:11.72] కోలో కోలన్న కోలో

[00:12.99] కొమ్మలు కిలకిల నవ్వాలి

[00:18.73] కోవెల్లో వెలిగే జ్యోతులు

[00:20.48] కళ్ళల్లో కొలువుండాలి

[00:25.99] ఆరారు ఋతువుల్లోని అక్కర్లేనిది ఏవుంది

[00:29.51] చూడాలే గాని మన్నే రంగుల పూదోటవుతుంది

[00:33.26] తోడై నీ వెంట కడ దాకా నేనుంటా

[00:36.76] రాళ్ళైనా ముల్లైనా మన అడుగులు పడితే

[00:39.76] పూలై పొంగాలా

[00:43.76] నువు దీనంగా ఏ మూలో కూర్చుంటే

[00:51.77] నిను వెంటాడే దిగులే వెళిపోతుందా

[00:57.03] యమ దైర్యంగా ఎదురెళ్లి నిల్చుంటే

[01:00.54] నిన్నెదిరించి బెదురింకా ఉంటుందా

[01:06.55] కోలో కోలన్న కోలో

[01:08.06] కొమ్మలు కిలకిల నవ్వాలి

[01:13.56] కోవెల్లో వెలిగే జ్యోతులు

[01:15.56] కళ్ళల్లో కొలువుండాలి

[02:12.28] చిన్న చిన్నా ఆనందాలు

[02:13.78] చిన్నబోని అనుబంధాలు

[02:15.80] అప్పుడప్పుడు చెక్కిలిగింతలు పెడుతుండగా

[02:23.28] కలత కన్నీళ్లు లేని చిన్ననాటి కేరింతల్ని

[02:26.82] చిటికేసి ఇటు రమ్మంటు పిలిపించగా

[02:34.08] కదిలొస్తోంది చూడు కన్నుల విందుగా

[02:37.58] ఊరందరిని కలిపే ఉమ్మడి పండుగా

[02:41.84] ఆ నలుగురితో చెలిమి పంచుకో

[02:45.59] చిరునగవు సిరులు పెంచుకో

[02:48.82] జడివానే పడుతున్న జడిసేన తడిసేన

[02:52.32] నీ పెదవులపై చిరునవ్వులు ఎపుడైనా

[02:55.84] నువు దీనంగా ఏ మూలో కూర్చుంటే

[03:03.14] నిను వెంటాడే దిగులే వెళిపోతుందా

[03:08.89] యమ ధీమాగా ఎదురెళ్లి నిల్చుంటే

[03:12.64] నిన్నెదిరించి బెదురింకా ఉంటుందా

[03:40.26] నీలోను నాలోనూ ఈ నేలెగా అమ్మాయి ఉంది

[03:44.01] అంతా అయినోళ్లే గాని పరులెవ్వరు

[03:51.01] మనలోని చుట్టరికాన్నీ మరిపించే ఈ దూరాన్ని

[03:54.77] చెరిపే వీలుందంటే కాదనరెవ్వరు

[04:01.51] ఒక పువ్వు విచ్చిన గంధం ఊరికే పోదుగా

[04:05.51] పది మందికి ఆనందం పంచకపోదుగా

[04:09.01] ఆ… తగిన వరసైన తారక తెరలు విడి దరికి చేరగా

[04:16.77] ప్రతినిత్యం పున్నమిగా అనుకోదా నెలవంక

[04:20.28] కలలన్ని విరియగా విరిసిన వెన్నెలగా

[04:23.78] నువు దీనంగా ఏ మూలో కూర్చుంటే

[04:31.28] నిను వెంటాడే దిగులే వెళిపోతుందా

[04:36.79] యమ దర్జాగా ఎదురెళ్లి నిల్చుంటే

[04:40.54] నిన్నెదిరించి బెదురింకా ఉంటుందా

[04:46.05] కోలో కోలన్న కోలో

[04:47.79] కొమ్మలు కిలకిల నవ్వాలి

[04:53.30] కోవెల్లో వెలిగే జ్యోతులు

[04:55.30] కళ్ళల్లో కొలువుండాలి