[iSongs.info] 07 - Komuram Bheemudo
[00:04.78] భీమా..! నినుగన్న నేల తల్లి, ఊపిరిబోసిన సెట్టూసేమా, పేరు బెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా, ఇనబడుతుందా..??
[00:23.94] కొమురం భీముడో… కొమురం భీముడో
[00:28.23] కొర్రాసు నెగడోలే… మండాలి కొడుకో
[00:33.01] మండాలి కొడుకో, ఓ ఓఓ
[00:37.54] కొమురం భీముడో… కొమురం భీముడో
[00:41.57] రగరాగా సూరీడై… రగలాలి కొడుకో
[00:45.86] రగలాలి కొడుకో, ఓ ఓఓ
[00:58.96] కాల్మొక్తా బాంచేనని ఒంగి తోగాల
[01:03.24] కారడవి తల్లీకి పుట్టానట్టేరో
[01:07.79] పుట్టానట్టేరో, ఓ ఓఓ
[01:12.32] జులుము గద్దెకు తలను ఒంచి తోగాలా
[01:16.33] తుడుము తల్లీ పేగున పెరగానట్టేరో
[01:20.86] పెరగానట్టేరో, ఓ ఓఓ
[01:25.64] కొమురం భీముడో… కొమురం భీముడో
[01:29.42] కొర్రాసు నెగడోలే… మండాలి కొడుకో
[01:34.23] మండాలి కొడుకో, ఓ ఓఓ
[01:55.62] సెర్మామొలిసే దెబ్బకు అబ్బంటోగాలా
[02:00.40] సినికే రక్తము సూసి సెదిరి తోగాల
[02:04.68] గుబులేసి కన్నీరు వొలికి తోగాల
[02:10.47] భూతల్లీ సనుబాలు తాగానట్టేరో
[02:17.02] తాగానట్టేరో, ఓ ఓ
[02:19.31] కొమురం భీముడో… కొమురం భీముడో
[02:23.59] కొర్రాసు నెగడోలే… మండాలి కొడుకో
[02:27.85] మండాలి కొడుకో, ఓ ఓఓ ఓఓ ఓ
[02:40.94] కాలువై పారే నీ గుండె నెత్తూరూ, ఊఊఉ
[02:49.49] కాలువై పారే నీ గుండె నెత్తూరు
[02:54.52] నేలమ్మా నుదుటి బొట్టుఐతోంది సూడు
[02:59.30] అమ్మా కాళ్ళ పారణైతుంది సూడు
[03:02.78] తల్లీ పెదవుల నవ్వై మెరిసింది సూడూ
[03:09.82] కొమురం భీముడో
[03:12.59] కొమురం భీముడో
[03:15.36] పుడమి తల్లికి జనమ అరణ మిస్తివిరో
[03:21.90] కొమురం భీముడో
