Mellaga
[00:25.51] మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
[00:31.63] చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం
[00:37.61] వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
[00:43.72] చినుకు పూల హారాలై అల్లుతున్నది మన కోసం
[00:49.39] తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా
[00:58.69] ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
[01:04.55] ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
[01:11.20] మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
[01:16.78] చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం
[01:22.89] 🎶🎶
[01:46.54] నీ మెలికలలోనా ఆ మెరుపులు చూస్తున్నా
[01:52.66] ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా
[01:58.77] ఆ ఉరుములలోనా నీ పిలుపులు వింటున్నా
[02:04.61] ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా
[02:10.99] మతి చెడి దాహమై అనుసరించి వస్తున్నా
[02:16.84] జత పడే స్నేహమై అనునయించనా
[02:22.42] చలిపిడుగుల సడి విని జడిసిన బిడియము తడబడి నిను విడగా
[02:28.78] ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
[02:34.63] ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
[02:41.27] 🎶🎶
[03:25.64] ఏ తెరుమరుగైనా ఈ చొరవను ఆపేనా
[03:31.75] నా పరువము నీ కనులకు కానుకనిస్తున్నా
[03:37.60] ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా
[03:43.44] ఆ వరునినికే రుణపడిపోనా ఈ పైనా
[03:49.58] త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైనా
[03:55.70] విడుదలే వద్దనే ముడులు వేయనా
[04:01.27] మన కలయిక చెదరని చెలిమికి రుజువని చరితలు చదివేలా
[04:10.56] ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
[04:11.63] ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
[04:31.82] మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
[04:37.92] చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం
[04:44.03] వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
[04:49.88] చినుకు పూల హారాలై అల్లుతున్నది మన కోసం
[04:55.45] తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా
[05:04.75] ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
[05:14.32] ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
