Lrc Player

Saswathamyna

Anil Kumar
[14:49.26]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:25.11] శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా! నీ ప్రేమే నను గెల్చెను!

[00:37.35] విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా! నీ కృపయే నను మార్చెను!

[00:50.09] నీ ప్రేమ ఉన్నతం, నీ ప్రేమ అమృతం, నీ ప్రేమ తేనెకంటే మధురము!

[01:02.58] నీ ప్రేమ లోతులో, నను నడుపు యేసయ్యా! నీ ప్రేమలోన నే వేరు పారి నీకై జీవించనా!

[01:14.26] ప్రేమతో ప్రేమతో – యేసయ్యా నిను వెంబడింతును

[01:26.75] ప్రేమతో ప్రేమతో ప్రేమతో – యేసయ్యా నిను ఆరాధింతును

[01:38.97] శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా! నీ ప్రేమే నను గెల్చెను!

[01:51.19] విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా! నీ కృపయే నను మార్చెను!

[02:16.95] నా తల్లి గర్భమునందు, నే పిండమునైయుండంగా, దృష్టించి నిర్మించిన ప్రేమ

[02:29.45] నా దినములలో ఒకటైనా, ఆరంభము కాకమునుపే, గ్రంథములో లిఖియించిన ప్రేమ

[02:40.34] నా ఎముకలను, నా అవయవములను, వింతగా ఎదిగించి రూపించిన ప్రేమ

[02:52.83] తల్లి ఒడిలో నేను, పాలు త్రాగుచున్నపుడు, నమ్మికను నాలోన పుట్టించిన ప్రేమ

[03:05.33] తన సొంత పోలిక రూపులోన నను సృష్టించిన ప్రేమ!

[03:11.17] ప్రేమతో ప్రేమతో – నీ కోసం నను సృజియించావయా!

[03:23.39] ప్రేమతో ప్రేమతో ప్రేమతో – నను మురిపెంగా లాలించావయా!

[03:35.61] శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా! నీ ప్రేమే నను గెల్చెను!

[03:48.11] విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా! నీ కృపయే నను మార్చెను!

[04:26.36] నే ప్రభువును ఎరుగకయుండి అజ్ఞానములో ఉన్నపుడు, నను విడువక వెంటాడిన ప్రేమ

[04:38.58] నా సృష్టికర్తను గూర్చి స్మరణే నాలో లేనపుడు, నా కోసం వేచిచూచిన ప్రేమ

[04:50.00] బాల్యదినములనుండి నను సంరక్షించి కంటిరెప్పలా నన్ను కాపాడిన ప్రేమ

[05:01.68] యౌవ్వన కాలమున కృపతో నను కలిసి సత్యమును బోధించి వెలిగించిన ప్రేమ

[05:14.43] నే వెదకకున్ననూ నాకు దొరికి నను బ్రతికించిన ప్రేమ!

[05:20.27] ప్రేమతో ప్రేమతో – యేసయ్యా నను దర్శించావయా!

[05:32.76] ప్రేమతో ప్రేమతో ప్రేమతో – నను ప్రత్యేకపరిచావేసయ్యా!

[05:44.98] శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా! నీ ప్రేమే నను గెల్చెను!

[05:57.19] విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా! నీ కృపయే నను మార్చెను!

[06:35.73] నే పాపినై యుండగానే, నాకై మరణించిన ప్రేమ, తన సొత్తుగ చేసుకున్న ప్రేమ

[06:47.68] విలువే లేనట్టి నాకై, తన ప్రాణపు వెల చెల్లించి, నా విలువను పెంచేసిన ప్రేమ

[06:59.11] లోకమే నను గూర్చి, చులకన చేసిననూ, తన దృష్టిలో నేను ఘనుడన్న ప్రేమ

[07:11.07] ఎవ్వరూ లేకున్నా, నేను నీకు సరిపోనా, నీవు బహుప్రియుడవని బలపరచిన ప్రేమ

[07:23.82] నా ముద్దుబిడ్డ నువ్వంటూ నన్ను తెగ ముద్దాడిన ప్రేమ!

[07:29.67] యేసయ్యా! యేసయ్యా! – నాపై యింత ప్రేమ ఏంటయా!

[07:41.88] యేసయ్యా! యేసయ్యా! యేసయ్యా! – నను నీలా మార్చేందులకేనయా!

[07:54.10] శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా! నీ ప్రేమే నను గెల్చెను!

[08:06.58] విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా! నీ కృపయే నను మార్చెను!

[08:32.35] పలుమార్లు నే పడినపుడు బహు చిక్కులలోనున్నపుడు కరుణించి పైకి లేపిన ప్రేమ

[08:44.57] నేనే నిను చేశానంటూ నేనే భరియిస్తానంటూ నను చంకన ఎత్తుకున్న ప్రేమ

[08:55.99] నా తప్పటడుగులను, తప్పకుండ సరిచేసి, తప్పులను మాన్పించి స్థిరపరచిన ప్రేమ

[09:08.22] నన్ను బట్టి మారదుగా, నన్ను చేరదీసెనుగా, షరతులే లేనట్టి నా తండ్రి ప్రేమ

[09:20.96] తనకిష్టమైన ఘనమైన పాత్రగా నను మలచిన ప్రేమ!

[09:26.54] ప్రేమతో ప్రేమతో – నను మరలా సమకూర్చావేసయ్యా!

[09:38.76] ప్రేమతో ప్రేమతో ప్రేమతో – నీ సాక్ష్యంగా నిలబెట్టావయా!

[09:50.99] శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా! నీ ప్రేమే నను గెల్చెను!

[10:03.47] విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా! నీ కృపయే నను మార్చెను!

[10:41.73] కష్టాల కొలుముల్లోన, కన్నీటి లోయల్లోన నా తోడై ధైర్యపరచిన ప్రేమ

[10:53.94] చెలరేగిన తుఫానులలో ఎడతెగని పోరాటంలో తన మాటతో శాంతినిచ్చిన ప్రేమ

[11:05.10] లోకమే మారిననూ, మనుష్యులే మరచిననూ మరువనే మరువదుగా నా యేసు ప్రేమ

[11:17.32] తల్లిలా ప్రేమించి, తండ్రిలా బోధించి ఆలోచన చెప్పి విడిపించిన ప్రేమ

[11:29.82] క్షణమాత్రమైనా నను వీడిపోని వాత్సల్యత గల ప్రేమ!

[11:35.66] ప్రేమతో ప్రేమతో – నా విశ్వాసం కాపాడావయా!

[11:48.15] ప్రేమతో ప్రేమతో ప్రేమతో – బంగారంలా మెరిపించావయా!

[12:00.36] శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా! నీ ప్రేమే నను గెల్చెను!

[12:12.59] విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా! నీ కృపయే నను మార్చెను!

[12:51.10] ఊహించలేనటువంటి కృపలను నాపై కురిపించి నా స్థితిగతి మార్చివేసిన ప్రేమ

[13:03.05] నా సొంత శక్తితో నేను ఎన్నడునూ పొందగ లేని అందలమును ఎక్కించిన ప్రేమ

[13:14.49] పక్షిరాజు రెక్కలపై నిత్యము నను మోస్తూ శిఖరముపై నన్ను నడిపించు ప్రేమ

[13:26.45] పర్వతాలపై ఎపుడూ, క్రీస్తు వార్త చాటించే సుందరపు పాదములు నాకిచ్చిన ప్రేమ

[13:39.19] తన రాయబారిగా నన్ను ఉంచిన యేసే ఈ ప్రేమ!

[13:45.04] ప్రేమతో ప్రేమతో – శాశ్వత జీవం నాకిచ్చావయా!

[13:57.26] ప్రేమతో ప్రేమతో ప్రేమతో – నను చిరకాలం ప్రేమిస్తావయా!

[14:09.47] శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా! నీ ప్రేమే నను గెల్చెను!

[14:21.96] విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా! నీ కృపయే నను మార్చెను!