Lrc Player

Saradaga Kasepaina 8D Song 🎧🔊 Paagal_ 8D Song 8D Music

Unknown artist
[04:57.98]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:13.59] ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావే…

[00:18.68] ఇవ్వాళ ఎవ్వరు పంపారే…

[00:24.79] ఇన్నేళ్ళ చీకటి గుండెల్లో…

[00:30.89] వర్ణాల వెన్నెల నింపారే…

[00:37.00] దారిలో పువ్వులై వేచెనే ఆశలు

[00:43.12] దండగా చేర్చెనే నేడు నీ చేతులు

[00:48.95] గాలిలో దూదులై ఊగెనే ఊహలు

[00:55.06] దిండుగా మార్చెనే ఈడ నీ మాటలు

[01:00.91] కొత్తగా కొత్తగా పుట్టినానింకోలా

[01:07.02] కాలమే అమ్మగా కన్నాదే నన్నిలా

[01:15.78] సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్న

[01:21.90] సరిపోదా నాకీజన్మకీ

[01:27.74] చిరునవ్యై ఓ సారైనా చిగురించా లోకంలోన

[01:33.84] ఇది చాల్లే ఇపుడీకొమ్మకీ

[02:09.19] చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదనా

[02:15.86] సంచిలో పోగు చేసి నీకియ్యనా

[02:21.96] చిందులేసే సంబరాన్ని ఈ రోజునా

[02:27.81] కొంచము దాచుకోక పంచెయ్యనా

[02:35.26] కలలోనే సంతోషం కలిగించే ఊపిరి

[02:41.38] ఉదయాన్నే నీకోసం ఉరికిందే ఈ పరి

[02:47.22] తలనిమిరే వేళ కోసం వెర్రోడినై

[02:53.33] వానలకై నేలలాగా వేచా మరి

[02:59.70] వందేళ్ళ జీవితానికి అందాల కానుక

[03:05.55] అందించినావు హాయిగా వారాలలోనే

[03:11.66] చుక్కానిలా నువ్వీక్షణం ముందుండి లాగగా

[03:17.50] సంద్రాన్ని ధాటినానుగా తీరాలలోనే

[03:23.35] చెంతనే చెంతనే నిన్నిలా చూస్తూనే

[03:29.74] ఆకసం అంచునే తాకానే నించునే

[03:38.24] సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్న

[03:44.35] సరిపోదా నాకీజన్మకీ…

[03:50.46] చిరునవ్యై ఓ సారైనా చిగురించా లోకంలోన

[03:56.30] ఇది చాల్లే ఇపుడీకొమ్మకీ…

[04:00.33] చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదనా…

[04:06.96] సంచిలో పోగు చేసి నీకియ్యనా…

[04:13.08] చిందులేసే సంబరాన్ని ఈ రోజునా…

[04:18.66] కొంచము దాచుకోక పంచెయ్యనా…