Anitha
[00:35.25] నా ప్రాణమా నను వీడిపోకుమా
[00:40.27] నీ ప్రేమలో నను కరగనీకుమా
[00:44.82] పదే పదే నా మనసే… నిన్నే కలవరిస్తోంది
[00:49.86] వద్ధన్నా వినకుండా… నిన్నే కోరుకుంటోంది, అనిత
[00:58.67] అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా
[01:02.98] దయ లేదా కాస్తైనా… నా పేద ప్రేమపైనా
[01:08.27] నా ప్రాణమా నను వీడిపోకుమా… నీ ప్రేమలో నను కరగనీకుమా
[01:30.17] ఓ ఓ హో.. ఓ హో హో హో ఒహోహో, ఓ ఓ హో
[01:40.00] నమ్మవుగా చెలియా… నే నిజమే చెబుతున్నా
[01:44.80] నీ ప్రేమ అనే పంజరాన… చిక్కుకొని పడి ఉన్నా
[01:49.57] కలల కూడ నీ రూపం… నను కలవరపరిచెనే
[01:54.62] కనుపాప నిను చూడాలని కన్నీరే పెట్టెనే
[01:59.90] నువ్వొక చోటా… నేనొక చోటా
[02:04.17] నిను చూడకుండ నే క్షణం ఉండలేనుగా
[02:09.20] నా పాటకి ప్రాణం నీవే… నా రేపటి స్వప్నం నీవే
[02:14.25] నా ఆశల రాణివి నీవే… నా గుండెకి గాయం చేయకే, అనితా
[02:21.57] అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా
[02:28.39] దయలేదా కాస్తైనా… నా పేద ప్రేమ పైన
[02:32.94] నా ప్రాణమా నను వీడిపోకుమా… నీ ప్రేమలో నను కరగనీకుమా
[02:57.30] నువ్వే నా దేవతవని… ఎదలో కొలువుంచా
[03:03.60] ప్రతి క్షణమూ ధ్యానిస్తూ… పసి పాపల చూస్తా
[03:07.13] విసుగు రాని నా హృదయం… నీ పిలుపుకై ఎదురు చూసె
[03:11.67] నిను పొందని ఈ జన్మే… నాకెందుకని అంటుందే
[03:16.96] కరుణిస్తావో, కాటేస్తావో… నువ్వు కాదని అంటే నే శిలనవుతానే
[03:26.52] నన్ను వీడని నీడవు నీవే… ప్రతి జన్మకి తోడువు నీవే
[03:32.05] నా కమ్మని కల్లలు కూల్చి… నను ఒంటరి వాన్ని చేయకే, అనిత
[03:38.35] అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా
[03:44.65] దయలేదా కాస్తైనా… నా పేద ప్రేమ పైన
[03:50.18] నా ప్రాణమా నను వీడిపోకుమా
[03:54.70] నీ ప్రేమలో నను కరగనీకుమా
[03:59.73] పదే పదే నా మనసే… నిన్నే కలవరిస్తోంది
[04:04.53] వద్ధన్నా వినకుండా… నిన్నే కోరుకుంటోంది, అనిత
[04:10.32] అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా
[04:17.63] దయ లేదా కాస్తైనా… నా పేద ప్రేమ పైన
[04:22.64] ఏదో రోజు నాపై నీ ప్రేమ కలుగుతుందనె
[04:27.66] ఒక చిన్ని ఆశ నాలో చచ్చేంత ప్రేమ మదిలో
[04:32.18] ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా
[04:36.97] ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా
[04:41.98] ఒట్టేసి చెపుతున్నా… నా ఊపిరి ఆగు వరకు
[04:46.00] నిను ప్రేమిస్తూనే ఉంటా, అనిత
[04:50.28] అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా
[04:57.58] దయ లేదా కాస్తైనా… నా పేద ప్రేమ పైన
