Lrc Player

Nee prasanalu

Spb
[04:24.99]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.84] నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా

[00:09.10] నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా

[00:15.34] ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా

[00:21.85] ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా

[00:27.83] పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా

[00:32.59] అపుడో ఇపుడో కననే కనను అంటుందా

[00:38.60] ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా

[00:44.34] గుడికో జడకో సాగనంపక ఉంటుందా

[00:50.09] బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా

[00:54.10] పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా

[01:00.34] ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా

[01:27.84] అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా

[01:33.84] కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా

[01:38.84] గతముందని గమనించని నడిరేయికి రేపుందా

[01:43.09] గతితోచని గమనానికి గమ్యం అంటూ ఉందా

[01:49.60] వలపేదో వల వేస్తోంది వయసేమో అటు తోస్తుంది

[01:54.58] గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది

[01:59.34] సుడిలోపడు ప్రతి నావ చెపుతున్నది వినలేవా

[02:08.84] పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా

[02:44.09] ప్రతిపూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా

[02:49.84] మనకోసమే తనలో తను రగిలే రవితపనంతా

[02:55.34] కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెపుతుందా

[03:00.34] కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని

[03:05.84] అని తిరగేసాయా చరిత పుటలు వెనుచూడక ఉరికే వెతలు

[03:11.59] తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు

[03:19.60] ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత

[03:29.09] పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా

[03:33.33] అపుడో ఇపుడో కననే కనను అంటుందా

[03:38.84] ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా

[03:42.09] గుడికో జడకో సాగనంపక ఉంటుందా

[03:49.84] బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా

[03:53.58] పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా

[04:00.59] ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా