Lrc Player

Nee prashnalu nike

Sirivennala sitharama sastry
[04:24.99]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.42] నీ ప్రశ్నలు నీవే..ఎవ్వరో బదులివ్వరుగా..

[00:06.93] నీ చిక్కులు నీవే..ఎవ్వరూ విడిపించరుగా..

[00:13.93] ఏ గాలో నిన్ను..తరుముతుంటే అల్లరిగా..

[00:22.19] ఆగాలో లేదో..తెలియదంటే చెల్లదుగా..

[00:28.17] పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..

[00:31.68] అపుడో ఇపుడో కననే కనను అంటుందా..

[00:37.18] ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..

[00:42.43] గుడికో జడకో సాగనంపక ఉంటుందా..

[00:48.18] బతుకుంటే బడి చదువా..అనుకుంటే అతి సులువా..

[00:53.94] పొరబడినా పడినా..జాలిపడదే కాలం మనలాగా..

[00:59.44] ఒక నిమిషం కూడా..ఆగిపోదే నువ్వొచ్చేదాకా….ఓ..ఓ..ఓ..ఓ..

[01:27.42] అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా..

[01:33.18] కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా..

[01:38.43] గతముందని గమనించని నడిరేయికి రేపుందా..

[01:43.93] గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా..

[01:49.18] వలపేదో వల వేసింది..వయసేమో అటు తోస్తుంది..

[01:54.44] గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే రుజువేముంది..ఓ..ఓ..ఓ..ఓ..

[02:03.18] సుడిలో పడు ప్రతి నావా..ఓ..ఓ..ఓ..ఓ..చెబుతున్నది వినలేవా..

[02:38.93] పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా..

[02:44.43] ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా..

[02:49.43] మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా..

[02:55.68] కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా..

[03:00.18] కడ తేరని పయనాలెన్ని..పడదోసిన ప్రణయాలెన్ని..

[03:06.43] అని తిరగేశాయా చరిత పుటలు..వెనుజూడక ఉరికే వెతలు..

[03:11.68] తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు….ఓ..ఓ..ఓ..ఓ..

[03:19.68] ఇది కాదే విధి రాత….ఓ..ఓ..ఓ..ఓ..అనుకోదేం ఎదురీత..

[03:28.17] పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..

[03:33.43] అపుడో ఇపుడో కననే కనను అంటుందా..

[03:38.68] ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..

[03:44.68] గుడికో జడకో..సాగనంపక ఉంటుందా..

[03:51.48] బతుకుంటే బడి చదువా..అనుకుంటే అతి సులువా..

[03:54.68] పొరబడినా పడినా..జాలిపడదే కాలం మనలాగా..

[04:01.18] ఒక నిమిషం కూడా..ఆగిపోదే నువ్వొచ్చేదాకా ….ఓ..ఓ..ఓ..ఓ..