Murari
[00:35.87] ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
[00:40.65] నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
[00:45.69] తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
[00:49.95] ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
[00:55.27] నా కోసమే తళుక్కన్నదో
[01:00.84] నా పేరునే పిలుస్తున్నదో
[01:05.63] పూవానగా కురుస్తున్నది
[01:10.68] నా చూపులో మెరుస్తున్నది
[01:14.40] ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా
[01:19.18] కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా
[01:34.58] ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
[01:39.91] ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
[02:09.14] కులుకులో ఆ మెలికలు మేఘాలలో మెరుపులు
[02:13.66] పలుకులో ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు
[02:18.17] పదునులో ఆ చూపులు చురుకైన చురకత్తులు
[02:23.48] పరుగులో ఆ అడుగులు గోదారి ముప్పొరదలు
[02:28.55] నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధామాధురి
[02:38.10] నా కళ్ళలో కలలపందిరి అల్లేయకోయి మహా పోకిరి
[02:47.68] మబ్బుల్లో దాగుంది తనవైపే లాగింది
[02:57.52] సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది
[03:07.62] ఓహొ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
[03:54.12] ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీ
[03:59.43] అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ
[04:03.69] మెరుపుని తొలి చినుకుని కలకలిపి చూడాలనీ
[04:08.72] ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియనీ
[04:13.79] ఎన్నాళ్ళిలా తనొస్తాడని చూడాలటా ప్రతిదారినీ
[04:23.35] ఏ తోటలో తనుందోనని ఏటు పంపను నా మనసునీ
[04:29.73] ఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగా
[04:43.02] అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా
[04:52.58] తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
[04:57.90] ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
[05:02.44] ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
[05:07.21] నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
[05:12.79] పూవానగా కురుస్తున్నది
[05:17.30] నా చూపులో మెరుస్తున్నది
[05:22.08] నా కోసమే తళుక్కన్నదో
[05:27.41] నా పేరునే పిలుస్తున్నదో
[05:31.65] కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా
[05:40.69] ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా..
[05:50.77] అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
[06:00.07] అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగీ దాగక
