సెలయేరు
[00:34.72] Male: సెలయేళ్ళు పాడుతుంటే ఓ పిల్ల
[00:37.76] ఎరగులూగుతుండే లోలోన
[00:42.28] Female: నదులన్నీ కలిసినట్టు ఓ పిలగ
[00:45.25] నవ్వెంత బాగున్నదీ నీలోన
[00:50.34] Male: గాజుల సప్పులు ఘల్ ఘల్ మోగంగా
[00:52.84] గజ్జెల పట్టీలు గంతేసి ఆడంగా
[00:55.08] వరిగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల
[00:57.83] వయ్యారి నడుమూపవే ఈ వేళ
[01:00.29] Female: సిగ్గు సింగారాలు సిలుకుతున్నట్టుగా
[01:03.10] ముద్దు మందారాలు పలుకుతున్నట్టుగా
[01:05.29] మాయా మాటలు పలుకకు ఓ పిలగా
[01:07.71] మా అన్నలొస్తున్నరు తోవల్ల
[01:10.51] Male: సెలయేళ్ళు పాడుతుంటే ఓ పిల్ల
[01:12.75] ఎదగూళ్ళుగుతున్నయే లోలోన
[01:45.34] పచ్చ జొన్నల కంకులు ఓ పిల్ల
[01:48.24] పాలొంచి వంగినయ్యి సేనంత
[01:53.09] Female: రామసిలకల సూపులూ చాలింక
[01:55.94] రత్నాల బొమ్మనైతి మా ఇంట
[02:01.10] Male: పచ్చ జొన్నల కంకులు ఓ పిల్ల
[02:03.39] పాలొంచి వంగినయ్యి సేనంత
[02:06.05] Female: రామసిలకల సూపులూ చాలింక
[02:08.26] రత్నాల బొమ్మనైతి మా ఇంట
[02:10.77] Male: వెయ్యంచు పువ్వుల్లో వెలిగింది నీ రూపు
[02:13.27] దీపాల కాంతుల్లో దరిచేరు నా వైపు
[02:16.04] జోడెడ్ల బండి కట్టీ ఓ పిల్ల
[02:18.97] జోరుగ ఎక్కిస్తనే ఈ వేళ
[02:20.71] Female: ముసిముసి నవ్వింది మురిపాల జాబిల్లి
[02:23.54] మదిలోన పూసింది మందార సిరిమల్లి
[02:26.11] మరుగు మాటల వాడివే ఓ బావ
[02:28.72] మా వదినలొస్తున్నరు తోవల్ల
[02:51.08] Male: బాయిగడ్డన పూసినై ఓ పిల్ల
[02:53.68] బంగారు కుసుమ పూలు నిండుగా
[02:58.98] Female: పూసిన పున్నమోలే నేనున్న
[03:01.25] బంగారు బొమలెందుకోయ్ నాకింకా
[03:06.39] Male: బాయిగడ్డన పూసినై ఓ పిల్ల
[03:08.97] బంగారు కుసుమ పూలు నిండుగా
[03:11.28] Female: పూసిన పున్నమోలే నేనున్న
[03:13.77] బంగారు బొమలెందుకోయ్ నాకింకా
[03:16.32] Male: కారెండ పడవీలో కస్తూరి రంగాయే
[03:19.06] వెండీ కొండలమీన వెలుగన్న లేదాయే
[03:21.85] నెమలి కన్నుల దానివే ఓ పిల్ల
[03:23.86] నెలవంక తీరున్నవే ఈ వేళ
[03:26.69] Female: నల్ల కలువల మీద నాటు తుమ్మెదవోలే
[03:29.22] అడవి మల్లెలమీద ఆ చంద్రవంకోలే
[03:31.51] కొంటే చూపుల వాడివే ఓ బావ
[03:34.10] కోడళ్ళు వస్తున్నరు తోవల్ల
[03:56.69] Male: పొద్దుతిరుగుడు పువ్వులా ఓ పిల్ల
[03:59.53] పొద్దంతా నిను చూస్తనే తొవ్వల్ల
[04:04.09] Female: సింగిడి రంగులల్లా పూసేటి
[04:06.67] సిరి జొన్నకంకినైతి తోటల్లా
[04:11.53] Male: పొద్దుతిరుగుడు పువ్వులా ఓ పిల్ల
[04:14.38] పొద్దంతా నిను చూస్తనే తొవ్వల్ల
[04:16.52] Female: సింగిడి రంగులల్లా పూసేటి
[04:19.19] సిరి జొన్నకంకినైతి తోటల్లా
[04:21.51] Male: చినుకమ్మ మెరుపమ్మ చినబోయినట్టుంది
[04:24.31] చలిమంట గిలిమంట ఎదలోన రగిలింది
[04:26.81] చిలుక గోరింకవోలే కూడుండి
[04:29.32] చితి మీద తోడొస్తనే ఓ పిల్ల
[04:31.96] Female: పాల ముత్యాలన్ని పరువాలు పలుకంగా
[04:34.26] పండు వెన్నెల వచ్చి పందిళ్లు వేయంగా
[04:36.85] మొగిలి పువ్వుల వాడివే ఓ బావ
[04:39.43] మనువాడి కలిసుంటనే నీ తోడ
[04:42.03] మొగిలి పువ్వుల వాడివే ఓ బావ
[04:44.36] మనువాడి కలిసుంటనే నీ తోడ
