Raghuvaran B tech
[00:18.67] అమ్మా అమ్మా
[00:20.92] నే పసివాణ్ణమ్మా...
[00:23.17] నువ్వే లేక
[00:25.42] వసివాడానమ్మా...
[00:27.92] మాటే లేకుండా
[00:30.93] నువ్వే మాయం...
[00:32.92] కన్నిరవుతోంది
[00:35.43] యదలో గాయం...
[00:37.67] అయ్యో వెళ్ళిపోయావే...
[00:40.93] నన్నొదిలేసి
[00:43.42] ఎటు పోయావే...
[00:46.03] అమ్మా ఇకపై నే వినగాలనా నీ లాలిపాట...
[00:51.26] నే పాడే జోలకు నువు కన్నెత్తి చూసావో అంతే చాలంట...
[00:58.25] అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా...
[01:03.01] నువ్వే లేక వసివాడానమ్మా...
[01:44.76] చెరిగింది దీపం...
[01:47.02] కరిగింది రూపం...
[01:49.25] అమ్మా నాపై ఏమంత కోపం...
[01:54.00] కొండంత శోకం...
[01:56.25] నేనున్న లోకం...
[01:58.75] నన్నే చూస్తూ నవ్వింది శూన్యం...
[02:03.27] నాకే ఎందుకు శాపం...
[02:07.26] జన్మల గతమే చేసిన పాపం...
[02:12.38] పగలే దిగులైన నడిరేయి ముసిరింది...
[02:17.38] కలవర పెడుతోంది పెను చీకటి...
[02:22.13] ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది...
[02:26.37] బ్రతికి సుఖమేమిటీ...
[02:30.36] ఓ అమ్మా అమ్మా
[02:33.12] నీ పసివాణ్ణమ్మా...
[02:35.62] నువ్వే లేక వసివాడానమ్మా...
[03:28.62] విడలేక నిన్నూ...
[03:31.88] విడిపోయి వున్నా...
[03:33.74] కలిసే లేనా నీ శ్వాసలోన...
[03:39.01] మరణాన్ని మరచి...
[03:40.85] జీవించి వున్నా...
[03:43.10] ఏ చోట వున్నా నీ ధ్యాసలోన...
[03:48.10] నిజమై నే లేకున్నా...
[03:51.84] కన్నా నిన్నే కలగంటున్నా...
[03:57.35] కాలం కలకాలం ఒకలాగే నడిచేనా...
[04:02.09] కలతను రానీకు కన్నంచున...
[04:06.59] కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన...
[04:11.34] చిగురై నిను చేరనా...
[04:15.84] అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా...
[04:20.20] నువ్వే లేక వసివాడానమ్మా...
[04:24.95] అడుగై నీతోనే నడిచొస్తున్నా...
[04:29.95] అద్దంలో నువ్వై కనిపిస్తున్నా...
[04:34.45] అయ్యో వెళ్ళిపోయావే...
[04:38.18] నీలో ప్రాణం నా చిరునవ్వే...
[04:42.69] అమ్మా ఇకపై నే వినగాలనా నీ లాలిపాట...
[04:48.19] వెన్నంటి చిరుగాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా...
