Lrc Player

Sri anjaneyam

Praveen
[03:14.85]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:07.96] శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం

[00:11.22] ప్రభా దివ్యకాయం ప్రకీర్తిప్రదాయం

[00:14.96] భజే వాయుపుత్రం భజే వాలగాత్రం

[00:18.47] భజే సూర్యమిత్రం భజేహం పవిత్రం

[00:22.46] భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం

[00:26.22] భజే వజ్రదేహం భజేహం..భజేహం…భజేహం

[00:33.21] Praveen

[00:35.82] ఏ యోగమనుకోను నీతో వియోగం

[00:39.57] ఏ పుణ్యమనుకోను ఈ చేదు జ్ఞానం

[00:43.58] తపస్సనుకోలేదు నీతోటి స్నేహం

[00:47.07] మోక్షమనుకోలేను ఈ మహాశూన్యం

[00:50.82] నేలపై నిలపక నెయ్యమై నడపక

[00:54.57] చేరువై ఇంతగా చేయి విడిచేందుకా

[01:00.08] అరచేత కడదాక నిలుపుకోలేవంటూ

[01:03.93] నిజము తెలిపేందుకా గాలికొడుకా

[01:07.54] ఇలా చూపేవు వేడుక

[01:11.78] శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం

[01:14.78] ప్రభా దివ్యకాయం ప్రకీర్తిప్రదాయం

[01:23.05] చరణం : 1

[01:23.14] రామనామము తప్ప వేరేమి వినపడని

[01:26.40] నీ చెవికెలా తాకే నా వెర్రికేక

[01:30.16] నీ భక్తి యోగముద్రను భంగపరిచేనా

[01:34.40] మట్టి ఒడిలోని ఈ గడ్డిపరక

[01:37.41] అమ్మ ఇచ్చిన నాటి నమ్మకము మెచ్చి

[01:41.40] అమృతపు నదిలాంటి కరుణలో ముంచి

[01:45.16] ఈత తెలియని నాతో ఆడుతున్నావా

[01:48.90] కోతి చేష్టలు చేసి నవ్వుతున్నావా

[01:54.66] శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం

[01:58.15] ప్రభా దివ్యకాయం ప్రకీర్తిప్రదాయం

[02:02.39] Praveen

[02:03.77] చరణం : 2

[02:05.51] కన్ను విడిచిన దృష్టి నిన్ను పోల్చేదేలా

[02:09.53] గొంతు విడిచిన కేక నిన్ను చేరేదెలా

[02:13.52] గుండె విడిచిన శ్వాస నిన్ను వెతికేదెలా

[02:17.03] నన్ను విడిచిన ఆశ నిన్ను పొందేదెలా

[02:22.41] బతుకోపలేనంత బరువైన వరమాల

[02:26.40] ఉరితాడుగా మెడను వాలి

[02:30.14] అణువంత నా ఉనికి అణిగేంతగా

[02:33.65] తలను నిమిరె హనుమంత నీజాలి

[02:37.65] నా చిన్ని బొమ్మవను భ్రమను చెరిపే తెలివి

[02:41.75] బ్రహ్మవని తెలిపి బలిచేస్తే ఎలాగయా

[02:46.75] నిలువునా నన్నిలా దహించే నీదయ నాకెందుకయ్యా

[02:54.51] ఓ ఆంజనేయా ఓ ఆంజనేయా

[03:00.02] ఓ ఆంజనేయా ఓ ఆంజనేయా ఓ ఆంజనేయా