Nee Prashnalu
[00:00.86] నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
[00:07.77] నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా
[00:16.80] ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
[00:23.18] ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
[00:27.43] పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
[00:31.94] అపుడో ఇపుడో కననే కనను అంటుందా
[00:37.52] ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
[00:43.36] గుడికో జడకో సాగనంపక ఉంటుందా
[00:49.48] బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
[00:54.26] పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
[00:59.31] ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా
[01:26.66] అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా
[01:33.30] కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
[01:37.82] గతముందని గమనించని నడిరేయికి రేపుందా
[01:43.43] గతితోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
[01:48.74] వలపేదో వల వేస్తోంది వయసేమో అటు తోస్తుంది
[01:54.32] గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది
[01:59.90] సుడిలోపడు ప్రతి నావ చెపుతున్నది వినలేవా
[02:10.53] పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా
[02:45.06] ప్రతిపూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా
[02:48.51] మనకోసమే తనలో తను రగిలే రవితపనంతా
[02:54.61] కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెపుతుందా
[02:59.66] కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని
[03:06.04] అని తిరగేసాయా చరిత పుటలు వెనుచూడక ఉరికే వెతలు
[03:10.29] తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
[03:15.87] ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత
[03:26.75] పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
[03:32.87] అపుడో ఇపుడో కననే కనను అంటుందా
[03:38.71] ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
[03:42.70] గుడికో జడకో సాగనంపక ఉంటుందా
[03:49.33] బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
[03:54.38] పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
[03:59.17] ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా
