Lrc Player

Aakasham Digivachi

S. P. Balsubramanyam
[05:10.33]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.08] ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి

[00:27.97] ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి

[00:37.53] ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి

[00:47.09] చెరి సగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం

[00:56.91] ఇదివరకెరుగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం

[01:05.95] మా యిళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే

[01:10.73] అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే

[01:16.04] ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి

[01:44.71] చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గు దొంతరలు

[01:49.25] ఆ సొంపులకు ఎర వేసే అబ్బాయి చూపు తొందరలు

[01:54.55] ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో

[02:04.10] వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో

[02:13.40] తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా

[02:17.93] ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా

[02:35.20] ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి

[02:45.02] ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి

[03:21.95] విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు

[03:26.72] సనసన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు

[03:31.78] సందు చూసి చకచక ఆడే జూదశిఖామణులు

[03:41.32] పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు

[03:50.37] తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ

[03:55.13] తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా

[04:12.14] ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి

[04:19.30] ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి

[04:26.73] చెరి సగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం

[04:36.32] ఇదివరకెరుగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం

[04:45.34] మా యిళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే

[04:50.38] అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే