Allantha Doorala
[00:20.13] అల్లంత దూరాల ఆ తారక
[00:24.41] కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
[00:28.38] అరుదైన చిన్నారిగా
[00:31.14] కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
[00:41.39] భూమి కనలేదు ఇన్నాళ్ళుగా
[00:45.67] ఈమెలా ఉన్న ఏ పోలిక
[00:49.42] అరుదైన చిన్నారిగా
[00:52.14] కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
[01:01.91] అల్లంత దూరాల ఆ తారక
[01:05.98] కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
[01:45.72] కన్యాదానంగా ఈ సంపద
[01:49.49] చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా
[01:53.99] పొందాలనుకున్నా పొందే వీలుందా
[01:58.22] అందరికి అందనిది ఈ సుందరి నీడ
[02:02.74] ఇందరి చేతులు పంచిన మమత
[02:06.99] పచ్చగ పెంచిన పూలతో
[02:10.99] నిత్యం విరిసే నందనమవదా
[02:14.96] అందానికే అందం అనిపించగా
[02:19.20] దిగివచ్చినో ఏమో దివి కానుక
[02:23.22] అరుదైన చిన్నారిగా
[02:25.97] కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
[03:30.22] తన వయ్యారంతో ఈ చిన్నది
[03:33.72] లాగిందో ఎందరిని నిలబడనీక
[03:38.46] ఎన్నో ఒంపుల్తో పొంగే ఈ నది
[03:42.51] తను ఏ మదిని ముంచిందో ఎవరికి ఎరుక
[03:46.98] తొలిపరిచయమొక తియ్యని కలగా
[03:51.22] నిలిపిన హృదయమే సాక్షిగా
[03:54.97] ప్రతి జ్ఞాపకం దీవించగా
[03:59.22] చెలి జీవితం వెలిగించగా
[04:13.97] అల్లంత దూరాల ఆ తారక
[04:17.98] కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
