Lrc Player

గమ్యం_చేరాలని_||_Gamyam_Cheralani_|_Dr_John_Wesly_||_Telugu_christian_Song(128k)

Unknown artist
[05:52.73]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:31.60] గమ్యం చేరాలని నీతో ఉండాలని

[00:36.85] పగలూ రేయి పరవశించాలని

[00:44.11] ఈ నింగి నేలా కనుమరుగైనా

[00:49.10] శాశ్వత జీవం పొందాలని

[00:53.85] సాగిపోతున్నాను నిన్ను చూడాలని

[00:58.11] నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) ||గమ్యం చేరాలని||

[02:09.08] భువి అంతా తిరిగి జగమంతా నడచి

[02:14.08] నీ జ్ఞానముకు స్పందించాలని

[02:19.33] నాకున్నవన్ని సమస్తం వెచ్చించి

[02:24.08] నీ ప్రేమ ఎంతో కొలవాలని

[02:29.33] అది ఎంత ఎత్తున ఉందో – అది ఎంత లోతున ఉందో

[02:39.37] అది ఏ రూపంలో ఉందో – అది ఏ మాటల్లో ఉందో ||సాగిపోతున్నాను||

[04:03.83] అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా

[04:08.33] శిరమును వంచి సహించాలని

[04:14.32] వేదన బాధలు గుండెను పిండినా

[04:21.57] నీదు సిలువనే మోయాలని

[04:25.85] నా గుండె కోవెలలోనా – నిన్నే నే ప్రతిష్టించి

[04:34.33] నీ సేవలోనే ఇలలో – నా తుది శ్వాసను విడవాలని ||సాగిపోతున్నాను||