01_-_Padara_Padara
[00:09.74] భల్లుమంటు నింగి ఒళ్లు విరిగెను గడ్డి పరకతోనా
[00:14.20] ఎడారి కళ్లు తెరుచుకున్న వేళన చినుకు పూల వాన
[00:19.19] సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊటబావినే
[00:23.19] శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టి నేలనే
[00:23.58] ♪
[00:38.79] పదర పదర పదరా
[00:40.45] నీ అడుగుకి పదును పెట్టి పదరా
[00:42.76] ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
[00:47.97] పదర పదర పదరా
[00:49.96] ఈ పుడమిని అడిగి చూడు పదరా
[00:52.21] ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా
[01:06.96] నీ కథ ఇదిరా
[01:08.19] నీ మొదలిది రా
[01:09.48] ఈ పథమున మొదటడుగేయిరా
[01:11.96] నీ తరమిదిరా అనితరమిదిరా అని చాటెయ్ రా
[01:16.62] పదర పదర పదరా
[01:18.89] నీ అడుగుకి పదును పెట్టి పదరా
[01:20.85] ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
[01:25.62] పదర పదర పదరా
[01:28.09] ఈ పుడమిని అడిగి చూడు పదరా
[01:30.61] ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా
[01:35.90] భల్లుమంటు నింగి ఒళ్లు విరిగెను గడ్డి పరకతోనా
[01:40.41] ఎడారి కళ్లు తెరుచుకున్న వేళన చినుకు పూల వాన
[01:45.13] సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊటబావినే
[01:50.38] శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టి నేలనే
[02:14.33] కదిలే ఈ కాలం
[02:16.62] తన రగిలే వేదనకీ
[02:19.13] బదులల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా
[02:23.87] పగిలే ఇల హృదయం
[02:26.35] తన ఎదలో రోదనకీ
[02:28.87] వరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా
[02:33.41] కనురెప్పలలో తడి ఎందుకని
[02:35.85] తననడిగే వాడే లేక
[02:38.34] విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా
[02:43.36] పదర పదర పదరా
[02:45.02] ఈ హలమును భుజము కెత్తి పదరా
[02:47.52] ఈ నేలను ఎదకు హత్తుకుని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా
[02:52.77] పదర పదర పదరా
[02:54.44] ఈ వెలుగను పలుగు దించి పదరా
[02:56.93] పగుళ్లతో పనికిరానిదను బ్రతుకు భూములిక
[03:00.17] మెతుకులిచ్చు కదరా
[03:26.41] నీలో ఈ చలనం
[03:28.42] మరి కాదా సంచలనం
[03:31.15] చినుకల్లే మొదలయి
[03:32.51] ఉప్పెన కాదా ఈ కథనం
[03:36.01] నీలో ఈ జడికి
[03:38.03] చెలరేగే అలజడికి
[03:40.80] గెలుపల్లే మొదలయి
[03:42.80] చరితగ మారే నీ పయనం
[03:45.54] నీ ఆశయమే తమ ఆశ అని
[03:47.55] తమకోసమనీ తెలిసాకా
[03:50.29] నువ్వు లక్ష్యమని తమ రక్షవనీ
[03:52.54] నినదించేలా
[03:55.20] పదర పదర పదరా
[03:56.95] నీ గతముకు కొత్త జననం ఇదిరా
[03:59.42] నీ ఎత్తుకు తగిన లోతు ఇది
[04:01.17] తొలి పునాది
[04:02.45] గది తలుపు తెరిచి పదరా
[04:04.69] పదర పదర పదరా
[04:06.41] ప్రతొక్కరి కథవు నువ్వు కదరా
[04:08.95] నీ ఒరవడి భవిత కలల ఒడి
[04:10.95] బ్రతుకు సాధ్యపడు
[04:12.16] సాగుబడికి బడిరా
[04:23.95] తనను తాను తెల్సుకున్న హలముకు పొలముతో ప్రయాణం
[04:28.60] తనలోని రుషిని వెలికి తీయు మనిషికి లేదు ఏ ప్రమాణం
[04:33.32] ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో
[04:38.61] తరాల వెలితి వెతికి తెచ్చిన వెలుగు రేఖవో
