01_-_Padara_Padara
[00:09.44] భల్లుమంటూ నింగివొళ్ళు విరిగెను గడ్డి పరకతోన
[00:13.69] ఎడారి కళ్ళు తెరచుకున్నవేళన చినుకు పూలవాన!
[00:18.92] సముద్రమెంత దాహమేస్తే వెతికేను ఊటబావినే
[00:23.42] శిరస్సువంచి శిఖరమంచు ముద్దిడే మట్టినేలనే...
[00:38.19] పదరా.. పదరా.. పదరా !
[00:39.96] నీ అడుగికి పదును పెట్టి పదరా!
[00:42.45] ఈ అడవిని చదును చెయ్యి మరి
[00:44.44] వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా !
[00:47.95] పదరా.. పదరా.. పదరా !
[00:49.70] ఈ పుడమిని అడిగిచూడు పదరా !
[00:51.95] ఈ గెలుపను మలుపు ఎక్కడను ?
[00:53.68] ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా !
[01:07.18] నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా,
[01:09.45] ఈ పథమున మొదటడుగైరా,
[01:11.66] నీతరమిదిరా, అనితరమిదిరా అని చాటేయ్ రా!
[01:16.70] || పదరా.. పదరా.. పదరా నీ అడుగికి ||
[01:26.44] || పదరా.. పదరా.. పదరా ఈ పుడమిని ||
[01:36.00] || భల్లుమంటూ ||
[02:14.20] కదిలే ఈకాలం, తన రగిలే వేదనికి,
[02:18.93] బదులల్లె విసిరిన ఆశల బాణం నువ్వేరా
[02:23.69] పగిలే ఇల హృదయం, తన యెదలో రోదనికి,
[02:28.93] వరమల్లె దొరికిన ఆఖరిసాయం నువ్వేరా!
[02:33.42] కనురెప్పలలో తడి ఎందుకని, తననడిగే వాడే లేక,
[02:38.20] విలపించేటి ఈభూమివొడి చిగురించేలా..!
[02:43.16] పదరా.. పదరా.. పదరా !
[02:45.33] ఈ హలమును భుజముకేత్తి పదరా,
[02:47.54] ఈ నేలను ఎదకు హత్తుకుని
[02:49.11] మొలకలెత్తమని, పిలుపునిచ్చి పదరా
[02:52.78] పదరా.. పదరా.. పదరా !
[02:54.39] ఈ వెలుగును పలుగుదించి పదరా
[02:56.67] పగుళ్లతో పనికిరానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా..!
[03:26.43] నీలో ఈ చలనం, మరి కాదా సంచలనం,
[03:30.92] చినుకల్లె మొదలై, ఉప్పెన కాదా ఈ కధనం,
[03:35.64] నీలో ఈజడికి, చెలరేగే అలజడికి,
[03:40.39] గెలుపల్లె మొదలై, చరితగా మారే నీ పయనం,
[03:45.17] నీ ఆశయమే తమ ఆశ అని, తమ కోసమని తెలిసాక,
[03:50.18] నువ్వు లక్ష్యమని, తమ రక్షవని నినదించేలా!
[03:55.17] పదరా.. పదరా.. పదరా !
[03:56.91] నీగతముకు కొత్త జనన మిదిరా,
[03:59.18] నీ ఎత్తుకు తగిన లోతు ఇది
[04:01.17] తొలి పునాది గది తలుపు తెరిచి పదరా!
[04:04.66] పదరా.. పదరా.. పదరా !
[04:06.40] ప్రతోక్కరి కథవు నువ్వు కదరా
[04:08.93] నీ ఒరవడి భవిత కళల వొడి
[04:11.07] బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా..!
[04:24.09] తనని తాను తెలుసుకున్న హలముకు పొలముతో ప్రయాణం,
[04:28.84] తనలోని ఋషిని వెలికితీయు మనిషికి లేదు ఏ ప్రమాణం
[04:33.58] ఉషస్సు ఎంత ఊపిరిచ్చిపెంచిన కాంతిచుక్కవో
[04:38.09] తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగురేఖవో
